గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 13:26:27

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే

హైదరాబాద్ : కరోనా పై తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పంపిన భువనగిరి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వాట్స్ అప్ గ్రూప్‌లో ఇద్దరు వ్యక్తులు కరోనాపై అసత్ ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు ఆ ఇద్దరితోపాటు, ఆ గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేస్ నమోదు చేశారు. అరెస్టయిన వారిపేర్లు భరత్‌కుమార్, శివకుమార్, బాలు అని పోలీసు అధికారులు వెల్లడించారు. చేతిలో సెల్ ఫోన్ ఉందికదాని ఏదిపడితే ఎడాపెడా రాసేసి నలుగురికీ పంపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతకుముందే సోమవారం హైదరాబాద్‌లోని చైతన్యపురిలో కరోనా వదంతులపై వాట్సాప్‌లో ఫేక్ మెసేజీలు పంపినవారిపై పోలీసులు కేసుపెట్టారు. ఇప్పుడు భువనగిరిలో రెండో ేసు నమోదైంది. వాట్సాప్‌లో తప్పుడు మెసేజీల విషయంలో తస్మాత్ జాగ్రత్త!logo
>>>>>>