సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత(Swimming) సరదా ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. క్వారీ గుంతలో(Quarry pit )ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండల పరిధిలోని బొప్పారం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతులు శావల్య రాజు (45) అతడి కూతురు శ్రావల్య ఉష (12),శ్రీపాల్ రెడ్డి (40 )గా గుర్తించారు. మృతులు హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లినట్లు సమాచారం.
చుట్టుపు చూపుగా వచ్చి ఒకేసారి ముగ్గురు మృత్యువాత పడటంతో బొప్పారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.