హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): తెలంగాణ విద్యా కమిషన్కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొ ఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, చారకొండ వెంకటేశ్, కే జ్యోత్స్నశివారెడ్డిని కమిషన్ సభ్యులుగా నియమించింది. ఇప్పటికే క మిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. కొత్త సభ్యుల నియామకంతో కమిషన్ పూర్తిస్థాయిలో కొలువుదీరినైట్లెంది.