హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కొత్తగా 3 ఆర్టీసీ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటితోపాటు 27 బస్స్టేషన్ల అప్గ్రేడేషన్, ఆధునీకరణకు రూ.108.02 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. కొత్తగా నిర్మించే డిపోల్లో నాగర్కర్నూల్, హుస్నాబాద్, అశ్వారావుపేట ఉన్నాయి. నిర్మాణ పనులకు సంబంధించిన కార్యాచరణను చేపట్టాలని సివిల్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించింది.
మద్గుల్, మహబూబ్నగర్, రేగొండ, వేములవాడ, గంగాధర, నిజామాబాద్, ఘన్పూర్, పాల్వంచ, మునుగోడు, చండూర్, చౌటుప్పల్, ఐజా, వనపర్తి, పబ్బురై, కొల్లాపూర్, పెంట్లవెల్లి, దమ్మపేట, మండలపల్లి, కథలాపూర్, గోదావరిఖని, గూడూరు, మర్రిగూడ, నెకొండ, నర్సంపేట, వలిగొండ బస్స్టేషన్లతోపాటు నెకొండ బస్స్టేషన్షాపింగ్ కాంప్లెక్స్, నర్సంపేట స్టేషన్గ్రౌండ్ఫ్లోర్, షాపింగ్ కాంప్లెక్స్) ఉన్నాయి.