భూత్పూర్(మహబూబ్‌నగర్) : మితిమీరిన వేగంతో నడుపుతున్న బైక్ అదుపుతప్పి(Bike Speed) డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్(Mahaboob Nagar) జిల్లా భూత్పూర్ సమీపంలో చోటు చేసుకున్నవివరాలను ఎస్సై భాస్కర్‌రెడ్డి, స్థానికులు వెల్లడించారు.
భూత్పూర్కు చెందిన ఆనంద్(24) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అతడి అక్క నాగమణి(26), మేనత్త వెంకటమ్మ(60)తో కలిసి పల్సర్ బైక్‌పై పనుల నిమిత్తం మహబూబ్‌నగర్‌కు వెళ్లి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. భూత్పూరు సమీపంలోని పాత తహసీల్ కార్యాలయం ఎదుట మోటర్ సైకిల్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో మోటర్ సైకిల్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను జిల్లా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.