హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నవీన్‌మిట్టల్, లోకేశ్‌కుమార్, కృష్ణభాస్కర్‌లతో కూడిన కమిటీని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా నివేదించాలని నిర్దేశించింది.
ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటుపై టీజీఈజేఏసీ హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి నేతృత్వంలో మంగళవారం నవీన్‌మిట్టల్‌ను కలిశారు. అంతకుముందు నాంపల్లిలో జేఏసీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులు బుధవారం సాయంత్రం సెక్రటేరియట్లో నవీన్‌మిట్టల్‌తో సమావేశం కానున్నారు.