కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్, అబూజ్మడ్ అడవుల్లో సోమవారం సాయంత్రం భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు నారాయణ్‌పూర్ జిల్లాలోని అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహించాయి.
అప్పటికే మాటువేసిన మావోయిస్టులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో, మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అడవిలోకి పారిపోయారు.