నిజామాబాద్ : జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జనజీవన స్రవంతిలో కలిసి ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ..వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో గంగాధర్, కమల్, జనార్ధన్ ఉన్నారు. వీరిని జక్రాన్ పల్లి మండలం కొలిపాకలో అదుపులోకి తీసుకున్నారు. పరారీలో మరో ఐదుగురు సభ్యులున్నట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు వివరాలను వెల్లడించారు. పట్టుబడిన వారి నుంచి మావోయిస్టు పార్టీ సాహిత్యం, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
