వన్యప్రాణి అవయవాలు విక్రయం.. ఇరువురు నిందితులు అరెస్టు
అక్రమంగా వన్యప్రాణి అవయవాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని హైదరాబాద్ జోన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు.
- పులి దంతాలు, గోర్లు స్వాధీనం
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అక్రమంగా వన్యప్రాణి అవయవాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని హైదరాబాద్ జోన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఓ హోటల్లో పులి అవయవాలను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పులి దందాలు, 7 పులిగోర్లను స్వాధీనం చేసుకున్నారు.
పులి అవశేషాలను కేరళకు చెందిన జుకరియా అనే వ్యక్తి నుంచి సేకరించినట్టు నిందితులు అంగీకరించారు. దీంతో స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి అవశేషాలు, నిందితులను హైదరాబాద్ సెంట్రల్ ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అటవీశాఖ అధికారి నిందితులను విచారించి కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చగా, కోర్టు 15 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

