హైదరాబాద్ : జనగామ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులు వరంగల్ చింతల్‌కు చెందిన అఫ్రిన్, ఫర్జాబ్, షౌకత్ హుస్సేన్‌గా గుర్తించారు. స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి శివారులోని టవేరా టైర్ పగలడంతో డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎనిమిది మంది ఉన్నారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెంగా.. నలుగురికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో చిన్నారి క్షేమంగా బయటపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.