హైదరాబాద్ : జనగామ జిల్లాలో(Janagama district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసు కుంది. లారీ, ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పాలకుర్తి మండలం వావిలాలలో చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు పాలకుర్తి నుంచి తొర్రూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వావిలాల గ్రామంలోని ఓ మూల మలుపు వద్ద ఎదురెదురుగా లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి.
ఈ ప్రమా దంలో మహబూబ్నగర్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాకు చెందిన హేమాని(65), అతని భార్య బుజ్జమ్మ(60) పాలకుర్తి మండలానికి చెందిన హసీమా(58) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. క్షతగాత్రులను హాస్పిటల్లో చేర్పించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.