నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం కలకలం (Students Missing) సృష్టించింది. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక నవీపేట్‌లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం స్కూల్‌కు వెళ్లొస్తామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన విద్యార్థినిలు కనిపించకుండాపోయారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు శిరీషను నిజామాబాద్ బస్టాండ్‌లో గుర్తించారు. దీంతో ఆమెను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన ఇద్దరు అమ్మాయిలు జగిత్యాల వైపు వెళ్లినట్లు తెలుస్తున్నాయి. అమ్మాయిల మిస్సింగ్‌తో వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థినులు ఎక్కడైనా కనిపిస్తే నవీపేట ఎస్సై (మొబైల్ నంబర్-87126 59845), నార్త్ రూరల్ సీఐ (మొబైల్ నంబర్-87156 59843)కి సమాచారం ఇవ్వాలని నవీపేట ఎస్సై వినయ్ తెలిపారు.