నర్సాపూర్, మే 7 : మెదక్ జిల్లాలో విషాదంలో చోటు చేసుకుంది. నాచారం చెక్ డ్యాంలో ఈతకోసం వెళ్లి నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రశాంత్ యాదవ్(27) వికాస్(27 ఆనంద్ రెడ్డి(27) తూప్రాన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం ఈతకోసం ముగ్గురు కలిసి చెక్ డ్యాంలోకి దిగారు.
ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. గమనించిన స్థానికులు మృదేహాలను వెలికితీశారు. ముగ్గురు స్నేహితుల మృతితో నర్సాపూర్ పట్టణంలో విషాద ఛాయలుఅముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.