Vijay | ఆర్బీ చౌదరి మృతితో కంటతడి పెట్టిన విజయ్.. జీవాను హత్తుకుని బోరున ఏడ్చిన దళపతి
Vijay | దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, ఆర్.బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మృతితో సినీ ప్రముఖులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.ఆర్.బీ చౌదరి మరణ వార్త తెలుసుకున్న వెంటనే విజయ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు
Vijay | దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, ఆర్.బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన మృతితో సినీ ప్రముఖులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.ఆర్.బీ చౌదరి మరణ వార్త తెలుసుకున్న వెంటనే విజయ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు, నటుడు జీవాను ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న జీవాను ఓదార్చే క్రమంలో విజయ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
ఆర్.బీ చౌదరి పార్థివ దేహం వద్ద నిలబడి విజయ్ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కదిలించింది. జీవా చేయి పట్టుకుని భోరున ఏడ్చిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ దృశ్యాలను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.అయితే విజయ్ అంతలా చలించిపోవడానికి కారణం కేవలం జీవాతో ఉన్న స్నేహం మాత్రమే కాదు. ఆయన సినీ కెరీర్లో కీలక మలుపు తీసుకురావడంలో ఆర్.బీ చౌదరి పాత్ర ఎంతో ప్రత్యేకమని సినీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.విజయ్ కెరీర్ ప్రారంభ దశలో ఆయనకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా పూవే ఉనక్కాగ. ఈ చిత్రాన్ని ఆర్.బీ చౌదరి తన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. అప్పటివరకు ప్రధానంగా మాస్ పాత్రల్లో కనిపించిన విజయ్ను ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ఇదే.
ఆ తర్వాత కూడా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. లవ్ టుడే, తుళ్ళద మనముం తుళ్ళుం, షాజహాన్, తిరుప్పాచి, జిల్లా వంటి చిత్రాలు విజయ్ స్టార్‌డమ్‌ను మరింత పెంచాయి.విజయ్ ఎదుగుదలలో ఆర్.బీ చౌదరి ఒక మార్గదర్శిలా నిలిచారని, ఆయనకు గాడ్‌ఫాదర్ లాంటి వ్యక్తి అని అభిమానులు చెబుతున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను విజయ్‌తో తెరకెక్కించాలని ఆర్.బీ చౌదరి ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే ఆయన కన్నుమూయడం సినీ వర్గాలను మరింత కలచివేసింది.ఆర్.బీ చౌదరి మృతి దక్షిణ భారత సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
. @TVKVijayHQ 🫂 @JiivaOfficial 💔pic.twitter.com/utNaEJMbUG
— Laxmi Kanth (@iammoviebuff007) May 6, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

