మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మరణించారు. గురువారం తెల్లవారుజామున భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో 44వ జాతీయ రాహదారిపై బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు.. ఆగిఉన్న డీసీఎం కిందికి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని దవాఖానకు తరలించారు.
బాధితులు హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించామన్నారు. వారంతా తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తున్నారని చెప్పారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.