వీపనగండ్ల/గణపురం, మే 4 : తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక సోమవారం పలువురు మృత్యువాతపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో తిప్పని సారయ్యగౌడ్ (62) మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు వెంటనే వరంగల్లోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సారయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పల్నాటి హనుమంతు (60) ఒక హోటల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పనికి వెళ్లిన ఆయన వడదెబ్బ తగలడంతో మృతి చెందాడు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలకేంద్రంలో మండలకేంద్రానికి చెందిన బొడ్డుపల్లి మురళి (42) ఆదివారం పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులను అతడిని జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.