Srisailam Project | శ్రీశైలం : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. భారీ వరదలకు ఇప్పటికే ఆలమట్టి, జూరాల డ్యామ్లు నిండుకున్నాయి. దీంతో వరదను దిగువకు వదలగా.. శ్రీశైలానికి వరద నీరుపోటెత్తింది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం అధికారులు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు మూడుగేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన 6, 7, 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తగా.. 81వేల క్యూసెక్కుల వరద స్పిల్వే మీదుగా నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తున్నది. డ్యామ్ మూడుగేట్లను కర్నూల్ చీఫ్ ఇంజినీర్ కబీర్ భాషా ఎత్తగా.. అంతకు ముందు అధికారులు కృష్ణమ్మకు అధికారులు పూజలు చేశారు. ప్రస్తుతం ఒక్కో గేట్ నుంచి 27వేల క్యూసెక్కుల నీరు దిగుకు వెళ్తున్నది.