హైదరాబాద్ : కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెల్లరీ నగల దుకాణం దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం వివరాలను మీడియాకు వెళ్లడించారు. మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు చోరీకి గురయిందన్నారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడు అని పోలీసులు తెలిపారు.
దోపిడీ తర్వాత రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందకు ప్రయత్నించారు. దోపిడీకి రెండు నెలల క్రితమే రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లో సుబోధ్ సింగ్ ముఠా చోరీలకు పాల్పడిందన్నారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను సీపీ అభినందించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు సీజ్
నగలు దోచుకొని బైకులపై మహారాష్ట్ర నుంచి బెంగాల్‌కు పరారైన దొంగలు
బిహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీహార్‌కు చెందిన ది గోల్డెన్ థీఫ్… https://t.co/QDS7Ra219O pic.twitter.com/mI7rKZ2ymN
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2026