హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో అసలైన డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్‌తో నకిలీ ఐడీలు సృష్టించిన కేసును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఛేదించారు. మెడికల్ కౌన్సిల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌తోపాటు చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేసి అడ్డదారిలో మెడిక ల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు అదనపు సీపీ (క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంకు చెం దిన కసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్‌కు చెందిన తోట దిలీప్ కుమార్ 2012లో చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 2012లో చైనా నుంచి వచ్చిన తరువాత ఇద్దరు యశోద దవాఖానలో కొన్నాళ్లు డ్యూటీ డాక్టర్లుగా పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు స్క్రీనింగ్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలోనే టీ ఎస్ మెడికల్ కౌన్సిల్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కందుకూరి అనంతకుమార్‌ను కలిసి ఒక్కొక్కరు రూ.9 లక్షలు ఇచ్చి నకిలీ ఐడీ నంబర్ల ను పొందారు. డాటాబేస్‌లో సిద్ద అమ్రిష్రాంరెడ్డి, భర్తకాని శ్రీనివాస్ పేరుతో ఉన్న ఐడీ నంబర్లు శివానంద్, దిలీప్‌కుమార్‌కు అనంతకుమార్ ఇ చ్చాడు. ఆ ఐడీల్లో నంబర్లు అలాగే ఉంచి వివరాలను మార్చి తిరిగి డాటాబేస్‌లో నమోదుచేశారు. అమ్రిష్రాంరెడ్డి తన వివరాలను రెన్యూవల్ చేసుకోవటానికి కౌన్సిల్‌ను సంప్రదించటంతో ఆయన ఐడీపై శివానంద్ వివరాలు కనిపించాయి. దీంతో పూర్తి డాటా పరిశీలించగా దిలీప్‌కుమార్ బాగోతం కూడా బయటపడిందని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. నలుగురి పేర్లతో కౌన్సిల్ నుంచి ఫిర్యాదు చేశారని, దీనిపై లోతైనా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. అనంతకుమార్, శివానం ద్, దిలీప్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.