వరంగల్ : వరంగల్(Warangal) జిల్లాలో విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి(Girl assaulting) పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్‌కు చెందిన తాటి శివరాజ్ కుమార్ అలియాస్ జెట్టి, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూచన మణిదీప్, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని బిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థి కోడం వివేక్ కలిసి విద్యార్థినిని నమ్మించి హోటల్లో సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ వెల్లడించారు. ముగ్గురు నిందితులు లక్నెపల్లిలోని బిట్స్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు ఆయన తెలిపారు. నిందితులు వాడిన కారుతో పాటు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండకు తరలించినట్లు ఏసీపీ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు అని తేలిపోయింది : హరీశ్ రావు
Jagadish Reddy | హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లు ప్రజలే మంచి, చెడు నిర్ణయిస్తారు : జగదీష్ రెడ్డి
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌లో పేదోడి ఇంటిపై బుల్డోజర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు