Begumpet | గుర్తు తెలియని అగంతకులు ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగాడు. తలకు హెల్మెట్, మాస్క్లు ధరించి ఇంట్లోకి ప్రవేశించగా తల్లీ కూతుళ్లు దుండగుడితో వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టారు. నిందితుడు దాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎంతో చాకచక్యంతో తుపాకీని లాక్కొని సైతం నిందితులను తరిమికొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ బేగంపేటలోని రసూల్పుర జైన్కాలనీలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బేగంపేటలో తల్లీకూతుళ్లు ఇద్దరూ నివసిస్తున్నారు. దుండగుడు తలకు హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత బ్యాగులోని తుపాకీని తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఒక్కసారిగా తల్లీకూతుళ్లు ఇద్దరు షాక్కు గురయ్యారు.
ఆ తర్వాత వెంటనే తేరుకొని అదును చూసి నిందితుల నుంచి నుంచి తుపాకీ లాక్కొని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు దాడి చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలిచారు. ఆ తర్వాత నిందితులు తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దుండగులు యూపీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.