తొర్రూరు, జూన్ 16 : మహబూబాబా ద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ‘నమస్తే తెలంగాణ, ‘టీన్యూస్’ రిపోర్టర్లకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ‘మీరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు రావొద్దు.. వస్తే కేసులు పెట్టి అరెస్టు చేయిస్తాం’ అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సోమవారం ఉదయం వాట్సా ప్ కాల్ ద్వారా ఫోన్ చేసి హెచ్చరించారు. ‘మా పార్టీ కార్యక్రమాలకు మేం పిలిచినప్పుడు మాత్రమే రావాలి. లేకపోతే మా కార్యకర్తలతో కొట్టిస్తాం. అదీకాకుండా కే సులు పెడతాం’ అని బెదిరించారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మీడియా ప్ర తినిధుల హకులను కాలరాస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థపైనే దాడిగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై పాత్రికేయ సంఘాలు కూడా స్పందించి జర్నలిస్టుల హకులను కాపాడాలని కోరారు.