MP Raghunandan rao | హైదరాబాద్ : మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్లోనే ఉన్నాం.. సాయంత్రంలోగా చంపేస్తామని ఎంపీని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్ కావడం ఇది ఆరోసారి. మెదక్ ఎంపీకి 9404348431 నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు.