బంజారాహిల్స్, ఏప్రిల్ 21 : హరితహారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు జీహెచ్ఎంసీ పరిధిలో కోట్లాది మొ క్కలు నాటి సంరక్షించింది. నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో సైతం పెద్దఎత్తున నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ రేవంత్ సర్కార్ తలపెట్టిన అండర్‌పాస్‌ల నిర్మాణం, మల్టీ ఫ్లైఓవర్ల కోసం వేలా ది చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేస్తుండటం తో పర్యావరణ ప్రియులు, కేబీఆర్ పార్క్‌కు వచ్చే సందర్శకులు, వాకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని బసవతారకం క్యాన్సర్స్ దవాఖాన నుంచి రోడ్ నంబర్-12లోని అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ రోడ్డు మధ్యలోని సెంట్రల్ మీడియన్లతోపాటు ఫుట్‌పాత్‌లపై ఉన్న భారీ వృక్షాలను నాలుగురోజులుగా నరికివేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 1,500 వృక్షాలను తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు.