Harish rao | రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరిట రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో చిట్ చాట్‌లో వారు మాట్లాడుతూ. ఆర్అండ్బీ రూ.12 వేల కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ రూ.6000 కోట్లు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారు. రూ.1800 కోట్లు నేరుగా వస్తాయి… నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపుతారు, జలయజ్ఞం కాదు ధనయజ్ఞం.. జేబులు దండుకుంటున్నారని నాడు తెలుగుదేశం, రేవంత్ రెడ్డి అంతటా చెప్పారు. చాలా పనుల బిల్లులు ఇవ్వడం లేదు, రోడ్లకు గుంతలు పడినా మరమ్మత్తులు చేయడం లేదు. కమీషన్ల కోసం హ్యాం రోడ్ల పేరిట వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు.
దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయికానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయి. తేడా 50 శాతం వస్తోంది. సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసింది. నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే.. ఇప్పుడు పది శాతం పెట్టారు. మొత్తం 34లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారు… ముందే రింగ్ అయ్యారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారు.
పంచాయతీరాజ్ లోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారు. ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేది, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చు.
హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగింది.నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయన్నారు. నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి, ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారు.రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారు. టెండర్లలో కుమ్మక్కు అయ్యారు. సివేట్, సరళ, బృందా,
బివిఎస్ఆర్ కంపెనీలు కుమ్మక్కయ్యాయి. పంచాయతీ రాజ్ శాఖలో 7 వర్కులు సివేట్ కు 3 వర్కులు జె ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్, బృందాకు ఇచ్చారు. రాష్ట్రంలో టెండర్ యక్సెస్ కు 5 శాతం సీలింగ్ ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాక్సెస్ ఎత్తివేశారు.
టెండర్లలో అవినీతి జరిగింది. టెండర్లు రద్దు చేయాలని. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలని హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ కు,రిజర్వ్ బ్యాంకు కు ఫిర్యాదు చేస్తాం. అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తాము. టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై మా ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలి… పారదర్శంగా నిర్వహించాలి. సీఓటీ అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలి, మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేయాలి. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ చేయాలి. సీవీసీ, ఆర్బీఐ సహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. అవినీతికి కారణమైన అధికారులు, కాంట్రాక్టర్లపై బీఆర్ఎస్ వచ్చిన తర్వాత విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పద్దులు చర్చకు వచ్చినపుడు బీఆర్ఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతామన్నారు. హైకోర్టు విచారణకు పట్టుబడతాం సింగరేణి శ్రీరాంపూర్ టెండర్ వ్యవహారాన్ని మేము బయటపెట్టిన తర్వాత లెస్‌కు పోయిందన్నారు.