Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో తోట శ్రీనివాస్ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ సతీష్ కుమార్, ప్రొఫెసర్ కృష్ణవేణి పర్యవేక్షణలో ”డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కోఆర్డినేటెడ్ కంట్రోల్ ఆఫ్ మల్టీ లెవెల్ ఇన్వర్టర్స్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ సిస్టం” అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి శ్రీనివాస్ సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఆర్కే 5 సింగరేణి గనిలో కార్మికుడిగా పని చేసిన తోట సదానందం విజయలక్ష్మి దంపతుల కుమారుడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.