అంధత్వ నివారణే కేసీఆర్ లక్ష్యం
అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు.
- బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆగయ్య
- వీర్నపల్ల్లిలో కేసీఆర్ కంటివెలుగు శిబిరం
- మొదటిరోజు 320 మందికి పరీక్షలు
వీర్నపల్లి, జూన్ 27: అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఏర్పాటు చేసిన కేసీఆర్ కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ మల్లారపు జ్యోత్స్నతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగయ్య కంటి పరీక్షలు చేయించుకొని, కండ్లద్దాలను తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దృష్టి లోపంతో ఎవరూ ఇబ్బంది పడవద్దని 2018లో కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు.
వీర్నపల్ల్లి మండల ప్రజలు అంధత్వం బారినపడకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేనివాళ్లు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా వీర్నపల్లి క్లస్టర్ పరిధిలో ఎనిమిది గ్రామాల నుంచి మొదటిరోజు 320 మంది తరలిరాగా సభేరి ఐ హాస్పిటల్కు చెందిన 20 మంది నిపుణులు కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి కండ్లద్దాలు అందించగా, ఆపరేషన్ అవసరమైన వారికి సిఫారసు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

