స్కిల్ కౌన్సిల్ కోర్సులకు ఆదరణ
ఈ విద్యాసంవత్సరం కొత్తగా డిగ్రీలో ప్రవేశపెట్టిన అంప్రెటిస్‌షిప్ ఎంబెడెడ్ సెక్టార్ స్కిల్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ కోర్సుల్లో విద్యార్థులు గణనీయంగా చేరారు. ఇప్పటివరకు మూడు విడతల దోస్త్ కౌన్సెలింగ్ ముగియగా, పలు కాలేజీల్లో సగానికిపైగా సీట్లు నిండాయి.
- 91 డిగ్రీ కాలేజీల్లో నిర్వహణ
- తొలి ఏడాదే భారీగా చేరికలు
- ఆసక్తి చూపుతున్న విద్యార్థులు
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం కొత్తగా డిగ్రీలో ప్రవేశపెట్టిన అంప్రెటిస్‌షిప్ ఎంబెడెడ్ సెక్టార్ స్కిల్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ కోర్సుల్లో విద్యార్థులు గణనీయంగా చేరారు. ఇప్పటివరకు మూడు విడతల దోస్త్ కౌన్సెలింగ్ ముగియగా, పలు కాలేజీల్లో సగానికిపైగా సీట్లు నిండాయి. దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ వెబ్ఆప్షన్ల గడువు సోమవారం ముగిసింది. ఈ స్కిల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది డిగ్రీలో నూతనంగా 22 రకాల కోర్సులను రాష్ట్రంలోని 91 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టారు. ఈ కోర్సుల్లో చేరినవారు మూడు రోజుల పాటు కాలేజీలో, మరో మూడు రోజులు సంబంధిత సెక్టార్‌లోని పరిశ్రమల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను విద్యార్థులకు రూ.5 నుంచి రూ.10వేల వరకు పారితోషికం చెల్లిస్తారు.
కాలేజీల్లో సీట్ల భర్తీ ఇలా..
- నిజాం కాలేజీలో బీబీఏ రిటైలింగ్ ఆపరేషన్స్ కోర్సులో 60 సీట్లుంటే 60 సీట్లు భర్తీ అయ్యాయి.
- నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీలో బీబీఏ లాజిస్టిక్స్ కోర్సులో 60 సీట్లకు 45సీట్లు నిండాయి.
- తెలంగాణ మహిళా వర్సిటీలో బీఎస్సీ ఫ్యాషన్డిజైన్ అండ్ టెక్నాలజీలో 60సీట్లకు 44 సీట్లల్లో విద్యార్థులు చేరారు.
- హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో బీబీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ కోర్సులో 38 మంది, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్‌లో 26 మంది, బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్లో 22, బీబీఏ ఈ కామర్స్ ఆపరేషన్స్‌లో 21 మంది చేరారు. ఇలా 91 కాలేజీల్లోని కోర్సులకు ఆదరణ లభించడం విశేషం.
ప్లేస్మెంట్ కల్పించే కోర్సులివి
ఈ స్కిల్ కౌన్సిల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు అంప్రెటిస్షిప్తో పాటు ప్లేస్మెంట్ కల్పిస్తాం. డిగ్రీ స్థాయిలోనే మంచి భవిష్యత్తునిచ్చే కోర్సులివి. వీటిల్లో చేరిన విద్యార్థులకు నెలకు కొంత ఆర్థిక సాయం అందుతుంది. అంప్రెటిస్‌షిప్ కోసం ఇటీవలే రిటైలర్స్ కౌన్సిల్‌తో ఎంవోయూను కుదుర్చుకొన్నాం. మరికొన్ని సంస్థలతో ఎంవోయూలు చేసుకోవాల్సి ఉన్నది. ఈ కోర్సులు పూర్తయిన తర్వాత అపోలో, ఎల్ఎండ్టీ వంటి మల్టీనేషనల్ సంస్థల్లో ప్లేస్మెంట్ కల్పిస్తాం.
– ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

