మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో(Mahbubabad )అర్ధరాత్రి దొంగల బీభత్సం(Thieves havoc) సృష్టించారు. అడ్డు వచ్చిన వారిని తీవ్రంగా గాయపరిచి అందినకాడికి దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగపడి గ్రామానికి చెందిన బైరోజు సుజాత అనే మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు.ఈ క్రమంలో దొంగలను సుజాత ప్రతిఘటించడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన మరొకరు వ్యక్తి పట్టిండ్ల రవికి తలను పగలగొట్టిన దొంగలు ఇంట్లో నగదను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను గ్రామస్తులు హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.