హైదరాబాద్: నగర శివార్లలోని మీర్‌పేటలో చోరీ జరిగింది. మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ సుమిత్రా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఓ ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. జిల్లెలగూడకు చెందిన మాధవాచారి కుటుంబం గురువారం రాత్రి సమీప బంధువల ఇంట్లో దావత్‌కు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియన వ్యక్తులు అర్ధరాత్రివేళ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు.
అదే సమయంలో దవాత్ ముగించికుని వారు ఇంటికి రావడంతో దుండగులు అందినకాడికి దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. దుండగులు పారిపోతుండగా గమినించిన మాధవాచారి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో 5 తులాల బంగారం, రూ.20 వేలు చోరీకి గురైనట్లు గుర్తించారు.