హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించే వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఆవిష్కరించనున్నారో వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వికారాబాద్‌లో స్పీకర్ గడ్డంప్రసాద్‌కుమార్ రాష్ర్టావతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ఖమ్మం, మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – వరంగల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి – సూర్యాపేట, పొన్నం ప్రభాకర్ -సిద్దిపేట, దామోదర రాజనర్సింహ -సంగారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – నల్లగొండ, ధనసరి అనసూయ సీతక్క -ములుగు, జూపల్లి కృష్ణారావు -మహబూబ్‌నగర్, శ్రీధర్‌బాబు – కరీంనగర్, కొండా సురేఖ- హనుమకొండ, తుమ్మల నాగేశ్వర్రావు – భద్రాద్రికొత్తగూడెంలో జాతీయజెండాలను ఆవిష్కరిస్తారు. ఇతర జిల్లాల్లో ప్రభుత్వ విప్‌లు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.