వనపర్తి, జనవరి 11(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వనపర్తి మున్సిపాల్టీలోని 33 వార్డుల ముఖ్యనాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఓట్లు అడగాలని సూచించారు. రేవంత్ సర్కార్ వైపల్యాలను తీవ్రంగా ఎండగట్టి ప్రజలకు అర్థం చేయించాలని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.