హైదరాబాద్, మార్చి 13 ( నమస్తే తెలంగాణ ) : గవర్నర్ తో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ అబద్ధాలనే చెప్పించిందని, చివరికి బీఆర్ఎస్ హయాంలో చేసిన ఘనతను కూడా కాంగ్రెస్ ప్ర భుత్వం చేసినట్టు చెప్పించ్చడం సిగ్గుచేట ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. మండలిలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు వేదికలను బీఆర్ఎస్ హ యాంలో నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ని ర్మించినట్టు చెప్పుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 2,02,725 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,083 ఉద్యోగాలను భర్తీ చే సినట్టు వివరించారు. మరో 42, 652 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాటి నియామకంలో జాప్యం జరిగిందని, వాటికి ఇప్పుడు నియామక పత్రాలిచ్చి కాంగ్రెస్ 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పుకున్నదని విమర్శించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ను తూలనాడటం మాని, ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో నిధులే లేనప్పుడు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ఎలా నిర్మిస్తారు? అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి, పెండింగ్ బిల్లులు చెల్లించడానికే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పుకున్నదని ఈ సందర్భంగా తెలిపారు. గురువారం గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో వాటిని చక్కదిద్దాలని, కొత్తగా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణం పేరుతో ఉన్న నిధులను దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. పక్కా పాఠశాల భవనాలు ఉన్న చోట పిల్లలు లేరని, పిల్లలు ఉన్న చోట టీచర్లు లేరని ఇలాంటి సమస్యలను సరిచేయాలని కోరారు. టీచర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.