జనగామ : జనగామ(Janagama) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు(Tension) నెలకొన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్‌లోకి కాంగ్రెస్ యువజన నేత వెళ్లడంతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
తనయుడు, కాంగ్రెస్ యువజన నాయకుడుప్రశాంత్ రెడ్డి వెళ్లాడు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. అదే సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉధృతంగా మారడం పోలీసులు ఇరువురు వర్గాలను చెదరగొట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.