అలంపూర్ చౌరస్తా, ఆగస్టు 20 : రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావును కలిసి విన్నవించారు. జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్న బాధలను ఆయనకు వివరించారు. నియోజకవర్గంతోపాటు, జిల్లాలో సమయానికి యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలతో పలుచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు.