తిమ్మాజిపేట : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగుల ( Gunny Bags ) కొరత రాకుండా చూడాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి (MLA Rajesh Reddy) సూచించారు. సోమవారం తిమ్మాజీపేట మండలం బుద్ధ సముద్రం, నేరెళ్లపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలలని సూచించారు. సన్న రకాలకు ప్రభుత్వం రూ. 500 బోనస్ అందిస్తుందని వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని నాణ్యతగా తీసుకురావాలని సూచించారు.
బుద్ధ సముద్రం గ్రామంలో ఆదివారం ఈదురుగాళ్లకు నేలకొరిగిన మొక్కజొన్న పంటలను , పాఠశాల భవనాన్ని పరిశీలించారు. నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ అగ్రికల్చర్ ఏడీ పూర్ణచందర్ రెడ్డి, ఏవో కమల్ కుమార్, విండో సీఈవో శ్రీనివాస్ యాదవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.