హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల మూలంగా భూమిని కోల్పోయే నిర్వాసితులకు అండగా ఉంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ట్రిపుల్ఆర్ నిర్మాణంతో భూములు కోల్పోయే బాధితులకు న్యాయం జరిగేలా ఉద్యమాలు, పోరాటాలు చేపడుతామని ప్రకటించారు.
మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ శాస్త్రీయంగా జరగాలని డిమాండ్చేశారు.