హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను కష్టాలను చుట్టుముడుతూనే ఉన్నాయి. సాగు నీళ్లు లేక, కరెంట్ రాక ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ జనం ఇప్పుడు గుక్కెలు మంచినీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎవరికి చెప్పాలో తెలియక, చెప్పిన అధికారులు పట్టించుకోక తాగు నీళ్ల కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో(Kamareddy) తీవ్ర నీటి కొరత(Water shortage )ఏర్పడింది. కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయాల్సి వస్తుంది. దీంతో చాలా మంది కాలనీవాసులు డ్రమ్ముల ద్వారా నీటిని నింపుకొని వాడుకుంటున్నారు. పట్టణంలో ప్రజలకు సరిపోయేలా నీటి సరఫ లేకపోవడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని, కొద్ది రోజుల నుంచే నీటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు, స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డిలో నీటి కొరత.. టాంకర్ల ద్వారా నీటి సరఫరా
ఇంటి ముందు డ్రమ్ముల్లో నీళ్లు నింపుకుని వాడుకుంటున్న ప్రజలు
కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు..
ఈ నేపథ్యంలో ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయాల్సి వస్తుంది. దీంతో చాలా… pic.twitter.com/EUI0pxAf1k
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024