హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జి ల్లాలో టైగర్ జోన్ కారిడార్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. కుమ్రంభీం ఆసిఫాబా ద్ కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ఏలు ఏలుసింగ్ మే రు, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌తో అటవీశా ఖ అధికారులు ఆదివారం వర్క్‌షాప్ ని ర్వహించారు. ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడుతూ టైగర్ జోన్ చేసే ఆ లోచన లేదని, వదంతులను నమ్మొద్దని తెలిపారు. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు.
కార్యాలయాలకు టీ-ఫైబర్ సేవలు ; ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో పనిచేసే టీ-ఫైబర్ ద్వారా అందించే ఇంటర్నెట్/ఇంట్రానెట్ సేవలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థ లు, ప్రభుత్వరంగ సంస్థలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అం డ్ కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. సేవలకు ధరలు నిర్ణయించినట్టు, వాటిని చెల్లించి ఉపయోగించుకోవాలని సూచించారు. 50ఎంబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌కు ఏఆర్సీ(యాన్యువల్ రికరింగ్ చా ర్జెస్) రూ.10,800, లాస్ట్ మైల్ ఓఎఫ్సీ కనెక్షన్‌కు రూ.9,500 నిర్ణయించినట్టు చెప్పా రు. కనెక్షన్ కోసం టీ-ఫైబర్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.