హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఒకటో తరగతిలో అడ్మిష న్లు కల్పించే విషయంపై గందరగోళ పరిస్థితు లు ఉన్నాయి. ఆరేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా..? లేక ఐదేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో సీబీఎస్ఈ, ఐబీ బోర్డుల స్కూళ్లల్లో ఆరేండ్లు నిండిన వారి కి, స్టేట్బోర్డు స్కూళ్లల్లో ఐదేండ్లు నిండిన వారి కి అడ్మిషన్లు కల్పిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు వయస్సును నిర్ధారించడం అత్యవసరం గా మారింది. రెండేండ్లుగా దీనిపై సర్కార్ ఏదీ తేల్చడంలేదు. స్టేట్ సిలబస్ స్కూళ్లకేమో ఐదేండ్లు.. సీబీస్ఎస్ఈ స్కూళ్లల్లో ఆరేండ్లు అమలవుతున్నది. ఒకే రాష్ట్రంలో రెండు విధానాలు ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఒకటో తరగతిలో ఐదేండ్లకు బదులు ఆరేండ్లను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసింది. 2025 మా ర్చిలోనే సర్కార్కు ఓ నివేదిక సమర్పించింది. మూడేండ్లు దాటిన వారికి నర్సరీలో, నాలుగేం డ్లు దాటితే ఎల్కేజీ, ఐదేండ్లు దాటితే యూకే జీ, ఆరేండ్లు దాటిన వారికి ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని సూచించింది. ఈ నిబంధనను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటిలో అమలుచేయాలన్నది. ఈ నివేదిక సర్కార్కు చేరి ఏడాది గడిచింది. అయినా సర్కార్ నిర్ణయం తీసుకోలేదు. ఆరేండ్ల వయోపరిమితిని అమలు చే యాలంటే రెండు జీవోలు సవరించాల్సి ఉం టుంది. జీవో-5, జీవో-20 ప్రకారం ఐదేండ్లుగా నిర్ధారించారు. ఈ జీవోలు సవరించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.