బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. రాష్ట్రవ్యాప్తంగా అధికారి పార్టీని వీడుతున్న కాంగ్రెస్ నేతలు
మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
- సాదరంగా ఆహ్వానించిన బీఆర్ఎస్ నాయకులు
హుజూరాబాద్/ సూర్యాపేట(నమస్తే తెలంగాణ) / మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 31 : మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో వీరన్నపేటకు చెందిన కాంగ్రెస్ నేత కుర్వ సత్యం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 48వార్డు నుంచి బొమ్మిడి అశోక్, చెనగాని అంజమ్మ, సల్మా మస్తాన్, కాల రామ్, దొండ శ్రీను, మేకల వెంకన్న, నిరంజన్, షేక్ యాకూబ్‌పాషా ఆధ్వర్యంలో 150 మంది బీఆర్ఎస్లో చేరారు. 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పెద్దగట్టు మాజీ చైర్మన్ కోడి సైదులు యాదవ్ 40 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్లో చేరారు.
వారందరికీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ తరఫున ఏడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గన్నారపు రాజు, ఉమ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

