Mana Ooru Mana badi | అడ్మిషన్లు నిల్.. విద్యార్థులు ఫుల్.. మన బస్తీ-బడికి మస్తు డిమాండ్
‘మన బస్తీ-మన బడి’కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఈ బస్తీబడి వరంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన బస్తీ-మన బడి’లో పాఠశాలలకు సౌకర్యాలను కల్పిస్తున్నది. వరంగల్ నర్సంపేటలోని హనుమాన్ దేవల్ పాఠశాల నూతన హంగులను సంతరించుకున్నది.
- 376 మంది విద్యార్థులతో కళకళ
నర్సంపేట, మార్చి 26 : ‘మన బస్తీ-మన బడి’కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఈ బస్తీబడి వరంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన బస్తీ-మన బడి’లో పాఠశాలలకు సౌకర్యాలను కల్పిస్తున్నది. వరంగల్ నర్సంపేటలోని హనుమాన్ దేవల్ పాఠశాల నూతన హంగులను సంతరించుకున్నది. ఇంగ్లిష్ మీడియం బోధించే ఈ పాఠశాలకు నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట మండలాల నుంచి కూడా పిల్లలు ఆటోల్లో వస్తుండటంతో 376 మందితో కళకళలాడుతున్నది.
విద్యార్థుల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేక ప్రతి తరగతిలోనూ ఏ, బీ సెక్షన్లు చేయాల్సి వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ఈ పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రవేశాలు దొరకాలంటే పోటీపడక తప్పడంలేదు. ఇక్కడ 11 మంది ఉపాధ్యాయులు కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం సకల సౌకర్యాలు కల్పించారు. స్కూల్ యూనిఫారం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, 183 డ్యుయల్ డెస్క్‌లు, ఎనిమిది గ్రీన్ బోర్డులు సమకూరాయి. మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా కిచెన్ షెడ్డు నిర్మించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. కరెంటు పోయినా అసౌకర్యం కలుగకుండా సోలార్ సిస్టం అమర్చారు. ప్రతి తరగతి గది గోడలపై ఆకట్టుకునేలా బొమ్మలు వేయించారు. సకల వసతులు కల్పించడంతో ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకడం కష్టంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

