హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ ఉద్ధరించిందేమిటని బీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ ప్రశ్నించారు. మాటలు మార్చడం.. ప్రజలను ఏమార్చడం తప్ప జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయాపైసా ఇవ్వలేదని సోమవా రం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎస్ఎల్బీసీని పండబెట్టి.. డిండికి గండికొట్టారని దుయ్యబట్టారు. ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రై తు రుణమాఫీ, ఉ ద్యోగాల భర్తీ, మహి ళలకు ఇచ్చిన హామీ ల అమలుపై ఎందు కు మాట్లాడటం లేద ని ప్రశ్నించారు. ప్రా ణాలకు తెగించి తెలంగాణను సాధించిన ఉద్యమ నేతలు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిసారించాలని హితవుపలికా రు. కాంగ్రెస్‌కు చివరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తంచేశారు.