హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రిజర్వాయర్లలో నీటి నిల్వ లు ఆశించిన స్థాయిలో లేవని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధం గా ఉన్నదని వివరించారు. హైదరాబాద్ హోటల్ అవాసాలో ‘సింపోజియం’ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పు లు అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు. వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నదని, ఆ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరమున్నదని వివరించారు.