పద్మశాలీ సంఘం నేతలకు ‘సూరత్’ మద్దతు
అఖిల భారత పద్మశాలీ సంఘం చేపట్టిన బున్కర్ ఏక్తా యాత్రకు సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం పద్మశాలీ సంఘం దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్టీ నేతల మద్దతును కూడగుతున్నది.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): అఖిల భారత పద్మశాలీ సంఘం చేపట్టిన బున్కర్ ఏక్తా యాత్రకు సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం పద్మశాలీ సంఘం దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్టీ నేతల మద్దతును కూడగుతున్నది. గుజరాత్లో పర్యటిస్తున్న ఆ బృందం సూరత్ జరీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులతో సోమవారం భేటీ అయ్యింది. జీరో జీఎస్టీ ఉద్యమం గురించి వివరించింది.
ఈ సందర్భంగా సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ చంద్ర హెచ్ జరివాలా మాట్లాడుతూ.. గతంలో రియల్ జరీ, ఇమిటేషన్ జరీలపై 12 శాతంగా జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయించిందని, ఐక్య పోరాటం ద్వారా తాము తిప్పికొట్టామని గుర్తుచేశారు. ఫలితంగా 12 శాతం నుంచి 5 శాతానికి జీఎఎస్టీని కుదించిందని చెప్పారు.
జీరో జీఎస్టీ కోసం సాగిస్తున్న ఉద్యమానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్ననేత, నటి, సామాజిక కార్యకర్త పూనమ్‌కౌర్, అంకుర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

