Runa Mafi | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కారు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంత న కుదరడం లేదు. రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. గురువా రం సాయంత్రం వరకు రూ. లక్ష వరకు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నెలాఖరులోగా రూ.1.5 లక్షల వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు మా ఫీ చేస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రకటనలకు, సీఎం చెప్తున్నదానికి పొంతన లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏకకాలంలో రూ.2 లక్షల మాఫీ అనేది అబద్ధమా? అని రైతులు నిలదీస్తున్నారు.
వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ను రాహుల్‌గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీలు గుప్పించారు. ఆ తర్వా త ఒకే దఫాలో డిసెంబరు 9న రూ. 2 ల క్షల రుణం మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. అయితే, ఏడు నెలల తొమ్మిది రోజుల తర్వాత ఇప్పుడు మూడు దఫా ల్లో రైతులకు రుణవిముక్తి కల్పిస్తామనడం రేవంత్‌కే చెల్లించింది. పంట సీజన్ మొద లై రెండు నెలలవుతున్నా రైతు భరోసా ఇవ్వకుండా నిధులను రుణమాఫీకి మ ళ్లించారని రైతులు ఆరోపిస్తున్నారు.