e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides రికవరీ మన దగ్గరే అత్యధికం

రికవరీ మన దగ్గరే అత్యధికం

రికవరీ మన దగ్గరే అత్యధికం
  • 99.45% కోలుకుంటున్నారు!
  • మరణాలు అర శాతమే
  • క్రమంగా పెరుగుతున్న రికవరీ రేటు
  • అందుబాటులో ఆక్సిజన్‌, ఔషధాలు
  • అక్కరకొచ్చిన ముందస్తు జాగ్రత్తలు
  • చికిత్సపై దృష్టిసారించిన అధికారులు
  • దవాఖానల్లో పెరుగుతున్న డిశ్చార్జ్‌లు
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు కేసులు 4,92,385
  • కోలుకున్నవారు 4,21,219
  • చికిత్స పొందుతున్నవారు 68,462

హైదరాబాద్‌, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్‌ బాధితులు పెద్దసంఖ్యలో కోలుకుంటున్నారు. కిందిస్థాయి వరకూ చికిత్స అందుతుండటం, హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిని నిత్యం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందిస్తుండటం మంచి ఫలితాలనిస్తున్నది. రాష్ట్రంలో శనివారం వరకు మొత్తం 4,92,385 మందికి కరోనా సోకగా, 4,21,219 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నా రు. మరో 68,462 మంది చికిత్స పొందుతున్నా రు. చనిపోయినవారు 2,704 మంది ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో రికవరీ రేటు 99.45 శాతంగా ఉన్నది. మొదటి వేవ్‌ ద్వారా వచ్చిన అనుభవం, దవాఖానల్లో ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నది. ఫలితంగా రికవరీ రేటు గరిష్ఠంగా ఉండటమే కాకుండా.. మరణాలు అత్యంత తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి.

అనుభవం నేర్పిన పాఠాలు..

మొదటి వేవ్‌లో వైరస్‌ స్వభావం, దాని దుష్ప్రభావం గురించి ఎవరికీ పెద్దగా తెలియని పరిస్థితి. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎంతో పోరాటం చేసింది. అయినప్పటికీ తొలి నెలల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువైంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం సూచనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను కట్టడిచేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేసింది. గాంధీతోపాటు టిమ్స్‌ దవాఖానను ప్రత్యేకంగా కొవిడ్‌ చికిత్సకు కేటాయించింది. ఈ చర్యలతో మొదటి వేవ్‌లో వైరస్‌ వ్యాప్తిని దాదాపుగా నిలువరించింది. సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉండటం, ప్రజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాప్తి ఎక్కువైంది. ఈ పరిస్థితిలోనూ రాష్ట్రంలో బాధితులకు పడకలు, ఆక్సిజన్‌ విషయంలో కొరత ఏర్పడకపోవడానికి ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలే ఉపకరించాయి.

ఆక్సిజన్‌ పడకలు, ఐసీయులకు కొరత లేదు

సెకండ్‌ వేవ్‌ విజృంభణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అవసరమైన ఆక్సిజన్‌ను సిద్ధం చేసుకోవడంతోపాటు పది వేల ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటుచేసింది. త్వరలో మరో 10 వేల బెడ్లకు ఆక్సిజన్‌ లైన్లు వేసే ప్రక్రియ పూర్తికానున్నది. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న కాలంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు ఖాళీగా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కలిపి శనివారం సాయంత్రం 5 గంటల వరకు 20,945 సాధారణ పడకలు, 6,479 ఆక్సిజన్‌ పడకలు, 2943 ఐసీయూ పడకలు.. మొత్తంగా 25,367 పడకలు ఖాళీగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. మరో పది వేల పడకలతోపాటు, మరిన్ని సాధారణ పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది.

కోలుకుంటున్నోళ్లే ఎక్కువ

కొవిడ్‌ మొదటి వేవ్‌ వచ్చినప్పుడు చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు. అవగాహన లేక వ్యాప్తి ఎక్కువైంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌ వంటి మందుల కొరత ఎక్కువగా ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ నిల్వలు అవసరమైనంత ఉన్నా యి. రోజు ఎంతోమంది కోలుకొని వెళ్తున్నా రు. పేషెంట్లలో ధైర్యం కనిపిస్తున్నది. దీర్ఘకాలిక రోగాలున్న కొందరిని మాత్రం వైరస్‌ ఇబ్బంది పెడుతున్నది.
-డాక్టర్‌ వేణుగోపాలక్రిష్ణ, ఆర్‌ఎంవో, నిర్మల్‌ జిల్లా దవాఖాన

అవసరమైన ప్రతి ఒక్కరికీ చికిత్స

కరోనా సోకిన 80% మందిలో ఎలాంటి లక్షణా లు ఉండట్లేదు. మరో 10-15% మందిలో స్వల్పస్థాయి లక్షణాలు కనిపిస్తున్నాయి. 5% మం దికి మాత్రమే ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్ల అవసరం ఏర్పడుతున్నది. దీనిపై పూర్తి స్పష్టతతో ఉన్న ప్రభు త్వం.. ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నది. లక్షణాలు లేనివారిని, స్వల్పస్థాయి లక్షణాలున్న వారిని ఇంట్లో లేదా కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉంచి ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నది. ఇందు లో 95% మంది కోలుకొని ఇంటికెళ్తుండ గా, 5% మందికి మాత్రమే పెద్ద హాస్పిటళ్లకు వెళాల్సిన అవసరం వస్తున్నది. ఇలాంటి వారికి దవాఖానల్లో ఆక్సిజన్‌, ఐసీయూ చికిత్స అందిస్తున్నా రు. ఇలా క్రమపద్ధతిలో జరుగుతున్న చికిత్స విధా నం వల్ల దవాఖానల నుంచి ఎంతోమంది కోలుకొని ఇండ్లకు వెళ్తున్నారు. నిజంగా అవసరమైన వారికి పడకలు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చికిత్స అందించడం సాధ్యమవుతున్నది. అందుకే తెలంగాణలో ఇప్పు డు దవాఖానల్లో చేరుతున్న వారి కంటే డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రికవరీ మన దగ్గరే అత్యధికం

ట్రెండింగ్‌

Advertisement