భీమారంలో ధాన్యం బస్తాల చోరీ
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని గోదాంలో ధాన్యం దొంగతనం జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలోని దుర్గా ఇండస్ట్రీకి చెందిన 2022-23 సీజన్‌కు సంబంధించిన వడ్లను సంచుల్లో నింపి ఇక్కడి గోదాంలో నిల్వ చేశారు.
- గోదాం తాళాలు పగలగొట్టి 40 క్వింటాళ్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- స్థానికులు రావడంతో 52 సంచులు వదిలి పరారీ
భీమారం, మార్చి 17 : మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని గోదాంలో ధాన్యం దొంగతనం జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలోని దుర్గా ఇండస్ట్రీకి చెందిన 2022-23 సీజన్‌కు సంబంధించిన వడ్లను సంచుల్లో నింపి ఇక్కడి గోదాంలో నిల్వ చేశారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గోదాం తాళాలు పగలగొట్టిన 40 క్వింటాళ్ల ధాన్యం ఎత్తుకెళ్లారు. అదే సమయంలో స్థానికులు అటువైపుగా రావడంతో 52 సంచులను వదిలి పరారయ్యారు. ఆపై స్థానికులు దుర్గా ఇండస్ట్రీ యజమాని దర్శనాల రమేశ్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తులు టాటాఏస్ వాహనంతో వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాట్నాలో కంట్రోల్ఎస్ డాటా సెంటర్
హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

