వరంగల్ : ఆస్తి విషయంలో జరిగిన గొడవలో(Property dispute) తమ్ముడు అన్న గొంతు(Throat) కోసిన ఘటన శుక్రవారం వరంగల్(Warangal) జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకుంది. దీంతో అన్నను స్థానికులు, బంధువులు ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. రంగశాయిపేటకు చెందిన రావుల రాజేశ్‌ఖన్నా, అతని అన్న రావుల రాజుకు సంబంధించిన ఆస్తి విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం ఇద్దరు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో తమ్ముడు రాజేశ్‌ఖన్నా అన్న రాజును బ్లేడ్‌తో గొంతు కోశాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఎంజీఎం దవాఖానకుకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Congress | అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. అసెంబ్లీలో పరిణామాలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం