Sabitha Indra Reddy | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): చీమలుపెట్టిన పుట్టలో పాములు జొర్రినట్టు జొర్రి పదవులు అనుభవిస్తూ కమిట్మెంట్తో పార్టీకి పనిచేసిన వారిని కుసంస్కారంతో మాట్లాడడం తగదని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి హితవు పలికారు. తాను 25 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించానని, నాడు నమోదైన సీబీఐ కేసుల చుట్టూ నేటికీ తిరుగుతున్నానని చెప్పారు. ఇదే ముఖంతో నాడు మన్మోహన్సింగ్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి స్వాగతం పలికి, నాడు పార్టీ చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేశానని తెలిపారు.
ఆరేండ్ల క్రితం కాంగ్రెస్‌లో చేరి అదృష్టం బాగుండి సీఎం సీటు దక్కగానే మహిళలపై కుసంస్కారం ప్రదర్శిస్తారా? అని నిలదీశారు. గురువారం ఆమె ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బడ్జెట్‌పై వివరంగా మాట్లాడుతుండగా, అది ప్రజల్లోకి చేరుతుందనే భయంతో దానిని డైవర్ట్ చేయడానికి సడన్‌గా సీఎం రేవంత్‌రెడ్డి లేచి తమపై కామెంట్ చేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు.
‘మీ వెనుక ఉన్న అక్కలను నమ్ముకుంటే నీకు జూబ్లీ బస్టాండే.. మమ్మల్ని ముంచారు. మిమ్మల్నీ ముంచుతారు’ అనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సీఎం స్థాయి వ్యక్తి ఏదిపడితే అది మాట్లాడొచ్చా.. నోటికి ఎంత వస్తే అన్ని మాటలు అనొచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎవరిని మోసం చేశామో చెప్పాలని నిలదీశారు. ‘నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావ్. నీకు నష్టం జరిగిందా? నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను గనుకనే ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చున్నావు.
నాడు నీకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఇస్తే నేను పార్టీ మారినవ్ అంటున్నవ్. మరి ఎందుకు నాతో కలిసి మాట్లాడలేదు. ఎందుకు ఫోన్ చేయలేదు. నా క్షేమం కోరుకొనే తమ్ముడివి అయితే, అక్కా ఎందుకు పోతున్నవ్ అని అడుగలేదు? 2014లో నాకు టికెట్ ఇవ్వకపోయినా, 2018లో నా కుమారుడికి టికెట్ ఇవ్వకపోయినా, ఒక తమ్ముడిగా నాకు సపోర్టుగా ఎందుకు ఉండలేదు’ అని అని నిలదీశారు. ఐదేండ్లలో కాంగ్రెస్ వాళ్లు ఎన్ని మాటలు మాట్లాడినా, వారిని ఒక్కమాట కూడా అనలేదని గుర్తుచేశారు.
ఈ ముఖంతోనే 20 సంత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవచేశా. నమ్మకంగా పనిచేశా. పార్టీకి ద్రోహం చేయలేదు. నటించడం చేతకాదు. నేను, నా కుటుంబం పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేశాం. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నా భర్త ఇంద్రారెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పుడు నాతో వచ్చేయ్.. లేదంటే మీకు మినిస్టర్ పదవి ఉండదు.. అని నాడు చంద్రబాబునాయుడు బెదిరించినా మేము వెళ్లదు. నా గురించి, నా కుటుంబం గురించి ప్రజలకు తెలుసు.
-సబితాఇంద్రారెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఏ ముఖం పెట్టుకొని వచ్చావ్.. అంటారా? అని సబితారెడ్డి ప్రశ్నించారు. ‘నాడు నేను ఒక్కదానిని పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు నీ ప్రతిపక్ష హోదా పో యిందా? ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నీ వల్లే నా ప్రతిపక్ష హోదా పోయిందని ఎందుకు చెప్పలేదు? ఐదేండ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎం దుకొచ్చింది. అంటే నవ్వు రేవంత్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చావ్. అందుకు నాకు సీఎం పదవి రాకుండా పోయిందనే ప్రస్ట్రేషన్ ఆయనలో కనిపించనట్టు అర్థమవుతున్నది’ అని పేర్కొన్నారు.
ఒక ఆడబిడ్డను పట్టుకొని ఏ మొహం పెట్టుకొని వచ్చావ్.. అంటున్న భట్టి.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఎక్కడి నుంచి వచ్చారని నిలదీశారు. కొందరు ఫోన్లో పిలువగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారని, కేసీఆర్ పక్కన గట్టిగ నిలబడినందుకే ఇలా తనను టార్గెట్ చేసి అవమానపరుస్తున్నారని వాపోయారు. భట్టి.. ఏం ముఖం పెట్టుకొని వచ్చారంటే.. సీఎం రేవంత్‌రెడ్డి బల్ల చరు స్తూ రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సీటుపై కూర్చున్న రేవంత్‌రెడ్డి గౌరవంగా మాట్లాడాలని హితవుపలికారు.
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, నిత్యం మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే బాధయిందా? అందుకే ఇలా వేధిస్తున్నారా? అని సబితారెడ్డి ప్రశ్నించారు. తాను ఇదే ముఖంతోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించానని, అందుకే నాడు అన్ని కార్యక్రమాలు చేవెళ్ల నుంచే ప్రారంభిస్తానని వైఎస్ అన్నారని గుర్తుచేశారు. ఆయన తనను ప్రేమగా చేవెళ్ల చెల్లెమ్మ అని పిలిచేవారని పేర్కొన్నారు. ‘ఈ ముఖంతోనే 20 సంత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవచేశా. నమ్మకంగా పనిచేశా. పార్టీకి ద్రోహం చేయలేదు. నటించడం చేతకాదు. నేను, నా కుటుంబం పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేశాం.
ఎన్టీఆర్ ప్రభుత్వంలో నా భర్త ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు నాతో వచ్చేయ్.. లేదంటే మీకు మినిస్టర్ పద వి ఉండదు.. అని నాడు చంద్రబాబునాయుడు బెదిరించినా మేము వెళ్లలేదు. నా గురించి, నా కుటుం బం గురించి ప్రజలకు తెలుసు.’ అని పేర్కొన్నారు. ‘నా ద్వారా వైఎస్ జగన్‌ను కొట్టాలనుకున్నారు. ఇంకా నాపై ఐదు సీబీఐ కేసులు ఉన్నాయ్. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ఖర్మకాలి రాజకీయా ల్లో వచ్చా. ఇంద్రారెడ్డి బతికుంటే రాణిలా ఇంట్లోనే ఉండేదాన్ని. కుటుంబ ప్రతిష్ఠ తగ్గకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న. పదవులు కావాలంటే టికెట్ ఇవ్వనప్పుడే బయటకు వెళ్లేదాన్ని’ అని తెలిపారు.
నాడు నేను ఒక్కదానిని పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు నీ ప్రతిపక్ష హోదా పోయిందా? ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నీ వల్లే నా ప్రతిపక్ష హోదా పోయిందని ఎందుకు చెప్పలేదు? ఐదేండ్లలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకొచ్చింది. అంటే నవ్వు రేవంత్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చావ్. అందుకు నాకు సీఎం పదవి రాకుండా పోయిందనే ఫ్రస్ట్రేషన్ భట్టిలో కనిపించనట్టు అర్థమవుతున్నది.
– సబితాఇంద్రారెడ్డి
ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం మోసం అయితే, మీరు చేసిందేమిటి? అని రేవంత్‌రెడ్డిని సబితారెడ్డి ప్రశ్నించారు. ‘చంద్రబాబు నిన్నుపైకి తెస్తే నువ్వు అండగా ఉన్నవా? నేను ఏం మోసం చేశానో చెప్పాలి. నువ్వే నన్ను మోసం చేశావ్. నన్ను వెనక్కి రమ్మని ఎందుకు పిలువలేదు. ఫోన్‌చేసి ఎందుకు మాట్లాడలేదు. మహిళలను ఎదగకుండా అడ్డుకుంటున్నావు. మహిళలపై ఆరోపణలు చేస్తున్నావ్. అవమాన పరుస్తున్నావ్. మహిళల వివరణ కూడా వినే ధైర్యం లేదా? బిల్స్ పాస్చేసుకొని మీరు ఎందుకు పారిపోతున్నారు’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. అన్ని గమనిస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రులు కేటీఆర్‌ను, హరీశ్‌రావును అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు మహిళలు అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. మహిళల పట్ల మీకున్న అవగాహన, భావజాలం ఏమిటనేది అర్థమైంది. సంస్కారం లేకుండా ఇలా ఎవరైనా మాట్లాడతారా? ఆడ్డబిడ్డను ఎవరమైనా అమ్మా అని పిలుస్తాం.
మహిళా ఎమ్మెల్యేలను కించపరిస్తే, అవమానిస్తే మాట్లాడరనని వారి ఉద్దేశం కావొచ్చు. కానీ, వదిలిపెట్టబోం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మమ్మల్ని బెదిరిస్తే బెదిరిపోయేంతగా బిజినెస్‌లు ఏమీలేవు. ప్రజల తరఫున మాట్లాడుతూనే ఉంటాం. కేసీఆర్ నేతృత్వంలో పనిచేస్తాం. సీఎం చైర్‌కు గౌరవం ఉండాలంటే మాకు కాదు.. తెలంగాణ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
క్షమాపణలు చెప్పాలి.
-సబితాఇంద్రారెడ్డి